News January 26, 2025

యరగండ్లపల్లి వాసికి అరుదైన గౌరవం

image

శౌర్యచక్ర అవార్డు గ్రహీత కుక్కుడుపు శ్రీనివాస్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇంటెలిజెన్స్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరించి గ్రామం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. శ్రీనివాస్ సాధించిన ఈ ఘనత తమ గ్రామం పేరును నిలబెట్టిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులు ఆయనను అభినందించారు.

Similar News

News November 3, 2025

NLG: కలిసిరాని ‘ఖరీఫ్’

image

జిల్లా రైతులకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తరువాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

News November 2, 2025

NLG: తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ!

image

తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తిప్పర్తి రైతు వేదికలో 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

నల్గొండ: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తు పొడిగింపు

image

నల్గొండ శివారు రాంనగర్ లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ స్త్రీలకు టైలరింగ్ లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుండి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 వరకు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.