News October 10, 2024
యర్నగూడెం జాతీయ రహదారిపై మంత్రి తనిఖీలు
దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. యర్నగూడెం జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద లోడుతో వెళుతున్న లారీలను ఆపి పత్రాలను పరిశీలించారు. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అక్రమాలపై దృష్టి సారించిన మంత్రి మనోహర్ ఈ మేరకు తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 2, 2024
ప.గో.: కార్తీక మాసం నేపథ్యంలో భక్తులకు ఎస్పీ విజ్ఞప్తి
కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, కాలువల వద్ద పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు, భీమవరంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు వారు సూచించే నిబంధనలు భక్తుల రక్షణ, భద్రత కోసమేనని చెప్పారు.
News November 1, 2024
పాలకొల్లు: పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి
పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో శుక్రవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసిందని ఆయన అన్నారు.
News November 1, 2024
ఏలూరు: పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు
ఏలూరు జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం 11.30కి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి నుంచి ద్వారకాతిరుమల (M) జగన్నాథపురం చేరుకుని లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం 2 గంటలకు ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించనున్నారు. 2.55 గంటలకు గ్రామంలో పింఛన్లు ఇవ్వనున్నారు.