News June 7, 2024
యర్రగొండపాలెంలో TDPని దెబ్బకొట్టింది ఇవే

రాష్ట్రంలో TDP ప్రభంజనం వీసినప్పటికీ వై.పాలెంలో గెలవలేకపోవటం పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. అయితే TDP గెలుపును నోటా, కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు దెబ్బతీశాయని చెప్పవచ్చు. YCP అభ్యర్థి చంద్రశేఖర్ 5,200 ఓట్లతో గెలిచారు. కాగా నోటాకు 2,222 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అజితారావుకు 2,166 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు పడిన ఓట్లు దాదాపు టీడీపీవే అని మా గెలుపును దెబ్బతీశాయని పలువురు అంటున్నారు.
Similar News
News November 20, 2025
ప్రకాశం: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.ap.gov.in వెబ్ సైట్లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

సాగర్ కవచ్కు 112 మంది పోలీసుల కేటాయింపు

జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సాగర్ కవచ్ను రెండు రోజులపాటు పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో మొత్తం 112 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులలో కేటాయించారు. సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను అడ్డుకోవడం, అనుమానాస్పద వస్తువులను గుర్తించడం వంటి అంశాలపై ప్రత్యేక పోలీస్ బృందాలను సైతం నియమించారు.