News October 27, 2024

యర్రగొండపాలెం వద్ద ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

యర్రగొండపాలెం వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన (1) నూర్ మహమ్మద్, (2) మొగల్ అప్రోజ్‌లు పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించేందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 14, 2024

ప్రకాశం జిల్లాలో పోసానిపై మరో ఫిర్యాదు

image

సినీ నటుడు, వైసీపీ మద్ధతుదారుడైన<<14606978>> పోసాని కృష్ణమురళిపై<<>> ప్రకాశం జిల్లాలో మరొకొందరు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ BR నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యర్రగొండపాలెం పోలీసులను టీడీపీ నేతలు ఆశ్రయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనిగిరిలో సైతం కొందరు నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 14, 2024

ఒంగోలులో ప్రారంభమైన బంగారు బాలోత్సవాలు

image

ఒంగోలులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమిమ్ అన్సారియా ఆధ్వర్యంలో గురువారం బంగారు బాలోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలల స్వేచ్ఛకు ప్రతీకతగా గాలిలోకి బెలూన్స్ వదిలారు. బాలల హక్కులు, వారికున్న రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వారం రోజులు గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహనను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 14, 2024

ఒంగోలులో DLDO సస్పెండ్

image

ప్రకాశం జిల్లాలో ఓ కీలక అధికారిణి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ఒంగోలు డీఎల్డీవోగా ఉన్న ఉషారాణి గతంలో డీపీవోగా పనిచేశారు. ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఇందులో ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ఆమెను ప్రభుత్వానికి సరెండ్ చేయగా.. తాజాగా ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.