News January 2, 2025
యర్రాజీకి విశాఖ ఎంపీ అభినందనలు

విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను ఎంపీ భరత్ సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
విశాఖ జూ పార్కుకు కొత్త నేస్తాల రాక

విశాఖ జూ పార్కుకు జంతు మార్పిడి విధానంలో కొత్త జంతువులు తీసుకొచ్చారు. జార్ఖండ్ రాష్ట్రం బిర్ష జూ పార్కు నుంచి హిమాలయన్ నల్లని ఎలుగుబంట్లు, గరియల్, స్పార్టెడ్ డవ్, సిల్వర్ పీజంట్ అనే జంతువులను, పక్షులను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడి జూకి పంపించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన వీటిని కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.
News November 28, 2025
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్కు 21 వినతులు

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.


