News October 7, 2024

యలమంచిలి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

image

యలమంచిలి మాజీ MLA కన్నబాబు ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాంబిల్లిలోని ఆయన ఇంటి తలుపు గడియలు విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. పూజగదిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. వీటి విలువ రూ.50వేల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఓ గ్యాస్ ఏజెన్సీలో రూ.50వేల నగదు పోయినట్లు బాధితుడు పి.సంతచేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీలపై ఆదివారం ఫిర్యాదులు అందడంతో దర్యాప్తు చేస్తున్నామని CI సీహెచ్ నర్సింగరావు తెలిపారు.

Similar News

News October 7, 2024

విశాఖలో ఆస్తి కోసం హత్య

image

మల్కాపురంలో ఈనెల 3న జరిగిన వాసు హత్య కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు పవన్ సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విద్యాసాగర్ తెలిపారు. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు గుర్తించామన్నారు. వాసు అన్న సింహాచలం మొదటి భార్య కుమారుడు పవన్ సాయిని పిలిపించి దాడి చేశారని సీఐ తెలిపారు.

News October 7, 2024

కేజీహెచ్‌లో నూతన భోజన కౌంటర్ ప్రారంభం

image

కేజీహెచ్‌లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ ఛారిటీస్ వారి సౌజన్యంతో భోజనం నూతన భోజనం కౌంటర్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. రోగుల బంధువుల కోసం భోజనం కౌంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ శివానంద తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2024

‘సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ విలీనానికి తీర్మానం’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ సభ్యుడు సాగి విశ్వనాథరాజు అన్నారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సెయిల్‌లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేస్తే స్టీల్ టన్నుకు రూ.10,000 తగ్గుతుందన్నారు. ఏపీలో ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సెయిల్‌లో విలీనం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.