News October 4, 2024
యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్‌తో దాడి
అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్‌తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్‌పై వెంకటరమణ బ్లేడ్‌తో దాడి చేశాడు.
Similar News
News January 11, 2025
విశాఖ: జూ. కళాశాలలకు నేటి నుంచి సెలవులు
విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు విశాఖలో ఆర్ఐఓ మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 వరకు సెలవులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 19 ఆదివారం కావడంతో తిరిగి 20 నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయన్నారు. ప్రైవేట్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News January 11, 2025
అనకాపల్లి: ‘అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు’
సంక్రాంతి పండగ పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇటువంటి కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు.
News January 10, 2025
‘ఫన్ బకెట్’ భార్గవ్‌కు 20ఏళ్ల జైలు.. ఇదీ కేసు!
యూట్యూబర్ <<15118839>>భార్గవ్<<>> (ఫన్ బకెట్ ఫేమ్)కు 20ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈయనది విజయనగరం జిల్లా కొత్తవలస. చెల్లి అంటూనే విశాఖకు చెందిన 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు 2021లో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దిశ చట్టం కింద భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణలో నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.