News December 8, 2024

యాక్సిడెంట్.. ఇద్దరు మిత్రులు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని షేట్‌బషీరాబాద్‌లో జరిగింది. పల్నాడు జిల్లా రాజులపాలెం గ్రామానికి చెందిన అనీల్(25), HYDలో ఉంటున్న కార్తీక్ రెడ్డి(26) స్నేహితులు. అయ్యప్ప మాలలో ఉన్న వీరు శుక్రవారం శబరిమల వెళ్లి తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. కార్తీక్ అక్కడికక్కడే చనిపోగా అనీల్ ఆస్పత్రిలో మృతి చెందాడు.

Similar News

News February 23, 2026

నేడు గుంటూరు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్‌లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 22, 2026

గుంటూరు: బ్యాంకులో నగలు మాయం..!

image

తుళ్లూరు(M) వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంక్‌లో బంగారు నగలు మాయమయ్యాయి. ఎస్సై కలగయ్య కథనం మేరకు.. ఈనెల 2న సేఫ్ లాకర్‌లో ఉంచిన 2 పౌచ్‌లలోని 328 గ్రాముల నగలు కనిపించడం లేదు. ప్రాథమిక అంతర్గత తనిఖీ, CCTV పరిశీలనలో అదే బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి సంధ్యారాణి అనుమతి లేకుండా తాళం చెవి తీసుకుని లాకర్ నుంచి పౌచ్‌లు తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.