News October 23, 2024

యాడికిలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని కుంటలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. వీరన్న పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అలియాస్ గుర్రం యాడికిలోని కుంట వద్ద ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 3, 2024

అనంత: రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు చక్రిక ఎంపిక

image

అనంతపురానికి చెందిన దండు చక్రిక నవంబర్ 21 నుంచి కటక్‌లో నిర్వహించనున్న బీసీసీఐ ఉమెన్ అండర్-15 వన్డే టోర్నీకి ఎంపికయ్యారు. ఆదివారం అనంతపురంలో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ భీమలింగా రెడ్డి మాట్లాడుతూ.. చక్రిక 2024-25 సీజన్‌కు ఆంధ్ర మహిళల అండర్-15 రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు.

News November 3, 2024

BREAKING: మంత్రి సవిత పర్యటనలో ఉద్రిక్తత

image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు సొంత పార్టీ నుంచే నిరసన వ్యక్తమైంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమిపూజ చేయడానికి మంత్రి రొద్దం గ్రామానికి రాగా.. మండలానికి చెందిన MP పార్థసారథికి కనీసం ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని MP వర్గీయులు నిలదీశారు. దీంతో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కొద్ది సేపు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

News November 3, 2024

సత్యసాయిబాబా 99వ జయంతి స్పెషల్

image

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఈనెల 23న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్‌తో పాటు, ట్రస్ట్ సభ్యులు 99వ జన్మదినం పురస్కరించుకొని స్తూపం ఆవిష్కరించారు. ఈ ఏడాది నిర్వహించే జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సత్యసాయి భక్తులు వస్తున్నట్లు వారు తెలిపారు.