News May 26, 2024
యాడికి: రాళ్లదాడి కేసులో 24 మంది అరెస్ట్

యాడికి మండలం కొనుప్పలపాడులో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య కర్రలతో ఒకరినొకరు కొట్టుకుని రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరు పరారీలో ఉండటంతో 24 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరచినట్లు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
Similar News
News February 17, 2025
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: కలెక్టర్

ఏ ఒక్క అర్జీదారుడు నిర్లక్ష్యానికి గురికాకుండా, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్ శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన PHRS కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News February 17, 2025
పెద్దవడుగూరు: దేవుడా.. పిల్లాడిపై దయ చూపలేకపోయావా..!

ఆ కుటుంబమంతా సంతోషంగా గడిపి కొద్ది క్షణాలలో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో మృత్యువు చిన్నారి రిత్విక్(3)ను కబళించింది. దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి భార్య, కుమారులతో కలిసి పెద్దపప్పూరు అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి రిత్విక్ మృతి చెందాడు. దేవుడా పిల్లవాడి మీద అయినా దయ చూపలేకపోయావా అంటూ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.
News February 17, 2025
అనంతపురం: అలర్ట్.. గ్రీవెన్స్‌డే స్థలంలో మార్పు

రాయదుర్గం పట్టణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని బళ్లారి రోడ్డు సీతారామాంజనేయ కళ్యాణమండపంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్వామా హాలు నుంచి సీతారామాంజనేయ కళ్యాణ మంటపానికి మార్చినట్లు కలెక్టర్ అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు ఈ స్థల మార్పును గమనించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.