News March 10, 2025
యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీ తీర్పు: MP కావాలి.. MLA వద్దు!

MP ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. గత లోక్సభ ఎన్నికల్లో 65 వేల ఓట్లు వేసి కిషన్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. అదే ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత GHMC ఎన్నికల్లో ఇదే ఓటర్లు BRSను ఆదరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తున్నారు.
News November 14, 2025
వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక కంట్రోల్ రూమ్

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వరంగల్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్లు కలెక్టర్ సత్య శారద ప్రకటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు జరిగే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ఫ్రీ 1800 425 3424ని సంప్రదించాలన్నారు.
News November 14, 2025
అమలాపురం: నాచు తయారీపై పైలెట్ ప్రాజెక్టు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానం, పల్లం గ్రామాల్లో సముద్రపు నాచు తయారీ పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. తన =కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం చర్చించారు. సముద్రపు నాచు తయారీకి 16 మంది డ్వాక్రా మహిళలు, ఆర్నమెంట్ చేపల పెంపకానికి 21మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.


