News October 26, 2024

యాదగిరిగుట్టలో అసాంఘిక కార్యకలాపాలు.. లాడ్జి సీజ్

image

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన లాడ్జిని రెవెన్యూ అధికారులు, పోలీసులు సీజ్ చేశారు. పాతగుట్ట కాలనీలో యాదాద్రి ఫ్యామిలీ రూమ్స్ పేరుతో లాడ్జి నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబరు 26న లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాల ఘటనపై కేసు నమోదైందని.. విచారణ అనంతరం RDO ఆదేశాలతో సీజ్ చేసినట్లు CI రమేశ్ వెల్లడించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News July 5, 2025

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత: జాయింట్ అడ్వైజర్

image

విపత్తుల నిర్వహణ అందరి బాధ్యత అని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద ఏర్పాటైన ఆపదమిత్ర వాలంటీర్లు, జిల్లా అధికారులతో చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు, తుపాన్లు, భూకంపాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సహాయం చేసేందుకు జిల్లాలోనూ ఆపద మిత్రులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 5, 2025

బాలసదనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో రూ.1.34 కోట్లతో నిర్మిస్తోన్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News July 5, 2025

విపత్తుల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధం: నల్గొండ కలెక్టర్

image

విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాల్, వసీం ఇక్బాల్ బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో నల్గొండ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ను కలిశారు.