News March 27, 2025

యాదగిరిగుట్ట: గోల్డ్ చీటింగ్.. చిట్యాలలో పట్టివేత 

image

యాదగిరిగుట్టలోని జై భవాని జువెలర్స్ యజమానులు జితేందర్ లాల్, మధు రాములు ప్రజలను చీటింగ్ చేసి బంగారంతో పారిపోయిన సంగతి తెలిసిందే. నిందితులను చిట్యాల వద్ద పట్టుకుని కేజీ 185 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని పోలీసులు చెప్పారు. మరో కేజీ 946 గ్రాముల బంగారాన్ని సౌత్ ఇండియా బ్యాంకులో గుర్తించామన్నారు. ఆ బంగారాన్ని సీజ్ చేయాలని ఇప్పటికే బ్యాంకు వారికి ఆదేశాలు పంపామన్నారు. 

Similar News

News July 8, 2025

కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

image

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News July 8, 2025

భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం

image

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 35.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 3.8 మి.మీ, పలిమెల 3.0 మి.మీ, మహముత్తారం 10.4 మి.మీ, కాటారం 3.8 మి.మీ, మల్హర్ 8.6 మి.మీ రేగొండ 2.6 మి.మీ, భూపాలపల్లి 3.4 మి.మీగా నమోదైంది.

News July 8, 2025

ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

image

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.