News February 12, 2025
యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్‌తో కలిసి బైక్‌పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్లోనే చనిపోగా.. సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 17, 2025
శ్రీరాంపూర్: రేపు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా చెల్లింపు

సింగరేణి సంస్థలో 2024-25లో రిటైరైన కార్మికులకు 35 శాతం లాభాల వాటాను గురువారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. అలాగే దీపావళి బోనస్(పీఎల్ఆర్) ఈనెల 23న చెల్లించనున్నట్లు వారు పేర్కొన్నారు. తమ సంఘం ఒత్తిడి మేరకు యాజమాన్యం అంగీకరించిందని.. ఈ విషయాన్ని విశ్రాంత కార్మికులు గమనించాలని వారు కోరారు.
News December 17, 2025
వెల్గటూర్: డ్రా పద్ధతి ద్వారా వరించిన సర్పంచ్ పదవి

వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల గ్రామంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. గ్రామంలో సర్పంచ్ పదవికి నలుగురు అభ్యర్థులు బరిలో నిలువగా, ఇద్దరు అభ్యర్థులకు 155 ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించగా.. కోటయ్య అనే వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కోటయ్యను అదృష్టం వరించింది.
News December 17, 2025
విశాఖ: ఎస్ఐల బదిలీల్లో మార్పులు

నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల జరిగిన 102 మంది ఎస్ఐల బదిలీల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. బుధవారం 18 మంది ఎస్ఐల విన్నపం మేరకు వారిని ఇతర స్టేషన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఎస్ఐలందరూ వెంటనే తమకు కేటాయించిన కొత్త స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పారదర్శకత, పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.


