News March 20, 2024
యాదగిరిగుట్ట వద్ద రోడ్డుప్రమాదం

యాదగిరిగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. 108 సిబ్బంది తెలిపిన వివరాలు.. భువనగిరి మున్సిపాలిటీ రాయగిరికి చెందిన శివ మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు యాదగిరిగుట్ట సమీపాన బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
Similar News
News October 18, 2025
NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 18, 2025
నాగార్జునసాగర్లో గవర్నర్ నజీర్కు కలెక్టర్ స్వాగతం

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నాగార్జునసాగర్ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా సాగర్ పరిసరాల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News October 18, 2025
రూల్స్ ప్రకారమే వైన్స్ టెండర్లు: డిప్యూటీ కమిషనర్

రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వైన్స్ టెండర్లు వేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండలో వైన్స్ టెండర్ల ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 154 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, నేడే తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో టెండర్లు వస్తాయని ఆయన చెప్పారు.