News February 25, 2026

యాదగిరిగుట్ట: స్వామివారిని దర్శించుకున్న మంత్రి

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రికి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

image

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT

News April 20, 2026

పల్నాడు: అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

image

నాదెండ్ల (M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ పంతులు అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తోటి కార్మికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో కేసు నమోదు చేశారు.

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.