News March 21, 2025

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,532 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.52,500, ప్రసాద విక్రయాలు రూ.7,87,840, VIP దర్శనాలు రూ.1,20,000, బ్రేక్ దర్శనాలు రూ.1,50,000, కార్ పార్కింగ్ రూ.2,24,000, వ్రతాలు రూ.69,600, యాదరుషి నిలయం రూ.42,000, లీజెస్ రూ.6,71,986 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.23,46,131 ఆదాయం వచ్చింది.

Similar News

News November 20, 2025

ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

image

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

News November 20, 2025

కరీంనగర్: డయల్ 100కు 47,481 కాల్స్

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ‘విజిబుల్ పోలీసింగ్ సిస్టం’ పకడ్బందీగా అమలవుతోంది. డయల్ 100 ద్వారా ఈ మధ్య కాలంలో 47,481 కాల్స్ రాగా, అందులో 2,547 ప్రమాదాలు, 493 ఆత్మహత్యాయత్నాలు, 5,961 మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసులు ఉన్నాయి. దీంతో ఘటన ఏదైనా డయల్ 100కు కాల్ చేయాలన్న చైతన్యం ప్రజల్లో పెరిగినట్లు స్పష్టమవుతోంది.