News March 28, 2025
యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాద విక్రయాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172, లీజేస్ రూ.22,92,572, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చింది.
Similar News
News October 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 21, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 21, 2025
విశాఖ 572 మంది ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు

విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు మంజూరు కానున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 572 మందికి వివిధ కేటగిరీల్లో ప్రమోషన్లు సిద్ధం చేసినట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు 27, మెకానికల్ సూపర్వైజర్లు 113, ఏడీసీలు 115, కండక్టర్లు గ్రేడ్-1 130, డ్రైవర్లు గ్రేడ్-1 167 మంది ఉన్నారు.
News October 21, 2025
గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.