News October 21, 2024
యాదమరి: చిరుత పులి మృతి

యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో నేడు ఓ చిరుత పులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి గోర్ల కోసం ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్‌తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.