News February 3, 2025
యాదాద్రిలో ఈనెల 4న రథసప్తమి వేడుకలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉ”గం.8.00లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి, తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం, రథసప్తమి విశిష్టత భక్తులకు ప్రధాన అర్చకులు వివరిస్తారు. రాత్రి 7.00గం.లకు స్వామి వారిని బంగారు రధంపై ఆలయ అంతఃప్రాకారంలో ఊరేగిస్తారు.
Similar News
News November 1, 2025
సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.
News November 1, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.
News November 1, 2025
PDPL: ‘యువత టాస్క్ సెంటర్ శిక్షణను వినియోగించాలి’

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి రీజినల్ టాస్క్ సెంటర్ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువత కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రైవేట్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందుతున్నారని కలెక్టర్ చెప్పారు. ఆసక్తి గల యువత టాస్క్ సెంటర్ ఉపయోగించుకోవాలని సూచించారు.


