News February 3, 2025

యాదాద్రిలో ఈనెల 4న రథసప్తమి వేడుకలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉ”గం.8.00లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి, తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం, రథసప్తమి విశిష్టత భక్తులకు ప్రధాన అర్చకులు వివరిస్తారు. రాత్రి 7.00గం.లకు స్వామి వారిని బంగారు రధంపై ఆలయ అంతఃప్రాకారంలో ఊరేగిస్తారు.

Similar News

News February 9, 2026

దుర్శేడు మండల పరిషత్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్ (R) మండలం దుర్శేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, గోపాలపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. 3వ తరగతి విద్యార్థులతో ఆమె గణితం, ఆంగ్ల పాఠాలు చదివించారు. ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీకి సంబంధించిన మోడల్ టెస్ట్ పేపర్లలోని పలు ప్రశ్నలను అడుగుతూ విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు తరచూ మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

News February 9, 2026

కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

image

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 9, 2026

MTM: బాల్య వివాహా ముక్తి రధాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ICDS ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బాల్య వివాహా ముక్తి రధాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ICDS PD రాణి, DCPO కిషోర్, తదితరులు పాల్గొన్నారు.