News October 3, 2024
యాదాద్రిలో నేటి నుంచి దేవి శరన్నానవరాత్రులు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం కొండపైన గల పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో నేటి నుంచి 9రోజులపాటు దేవి శరన్నవరాత్రులను ఆలయాధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ 9 రోజులు దేవి శరన్నవరాత్రుల్లో భక్తులు రూ.1,116 చెల్లించి దేవిపూజల్లో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
Similar News
News September 18, 2025
NLG: ఇంటర్ ఫలితాలు తిరోగమనం…!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనిస్తోంది. మూడేళ్లుగా జిల్లాలో ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 12వ స్థానానికి పడిపోయింది. మెరుగైన ఫలితాలు సాధించేందుకు యంత్రాంగం దృష్టి సారించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.
News September 18, 2025
ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలి: కలెక్టర్

కెజిబివి, ఇంటర్మీడియట్ కళాశాలలో ఫలితాలను పెంచడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా పాఠశాలలు, ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేజీబివిలు, ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు, అప్లిఏషన్, ఫలితాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. గడిచిన 3 సంవత్సరాలలో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.