News January 12, 2025

యాదాద్రిలో మూడో రోజు కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

image

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో మూడో రోజు అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో భక్తులకు నరసింహుడి దర్శనమిచ్చారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు యాదగిరీషుడు దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది.

Similar News

News February 13, 2025

NLG: ఎంజీయూలో నూతన నియామకాలు..

image

MG యూనివర్సిటీ పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కంట్రోలర్‌గా డా. ఎం. రామచందర్ గౌడ్, కాంపీటేటీవ్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్‌గా సోషల్ వర్క్ విభాగ అధిపతి, డా. ఎస్ శ్రవణ్ కుమార్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఒక ఏడాది పాటు ఆ స్థానాల్లో సేవలు అందించనున్నారు. సహ అధ్యాపకుల నియామకం పట్ల అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

News February 12, 2025

నల్గొండ: కుమారుడి బాధ్యతను నెరవేర్చిన కుమార్తె

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో చేపూరి బాబురావు (45) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి సంతానంగా కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తే తండ్రికి తలకొరివి పెట్టి, కుమారుడు లేని లోటు తీర్చింది. అలాగే మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

News February 12, 2025

నల్గొండ: జిల్లాలో మొత్తం 1911 పోలింగ్ స్టేషన్లు

image

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించారు. ఈ మేరకు జడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి మంగళవారం జాబితాను విడుదల చేశారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1911 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 400 మంది ఓటర్ల వరకు 145 పోలింగ్ స్టేషన్లు, 401 నుంచి 500 మంది ఓటర్ల వరకు 420 పోలింగ్ స్టేషన్లు, 501 నుంచి 750 మంది ఓటర్ల వరకు 1,346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

error: Content is protected !!