News October 22, 2024
యాదాద్రిలో శునకం.. ఆగిన దర్శనాలు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధర్మ దర్శనం కాంప్లెక్స్ నుంచి నేరుగా భక్తుల వెంట నడుచుకుంటూ శునకం నేరుగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడంతో వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆలయం నుంచి శునకాన్ని బయటకు పంపారు. ఆలయ అధికారులు సుమారు అరగంట పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రోక్షణ పూజలు చేశారు.
Similar News
News November 15, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్
News November 14, 2025
NLG: నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలు: జిల్లా ఎస్పీ

నేటి బాలలే దేశ ప్రగతికి మూలాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా నల్గొండలోని సెయింట్ ఆల్ఫన్స్ పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ యుగంలో యువత చిన్న వయస్సులో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
News November 14, 2025
NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


