News March 5, 2025
యాదాద్రి: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 40 టీచర్ పోస్టులు, 118 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
జగిత్యాల: వృద్ధాశ్రమంలో క్రీడా పోటీలు నిర్వహణ

వృద్ధ తల్లిదండ్రుల పోషణ–సంక్షేమ చట్టం వృద్ధులకు పెద్ద ఆసరా అవుతోందని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. అనాధ వృద్ధాశ్రమంలో వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు, చదరంగం, పచ్చీసు, క్యారమ్ వంటి క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. వృద్ధులను నిరాదరిస్తే 3 నెలల జైలు, జరిమానా విధించే అధికారం ఆర్డీవోకు ఉందని ఆయన తెలిపారు.
News November 15, 2025
బాసర: వంతెనపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

బాసర మండలం టాక్లి గ్రామానికి చెందిన చిల్లేవాడ్ హమ్మీబాయి(55) గ్రామ శివారులోని వాగు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను రక్షించే ప్రయత్నంలో ఆమె కుమారుడు శ్రీనివాస్ వాగులో దూకి గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. మహిళ మృతదేహం నీటిలో తెలియాడుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
KTDM: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా పోలీసులు!

మావోయిస్టు ప్రాంత ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ అన్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చెప్పారు. చర్ల మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామాలైన బక్కచింతలపాడు, కిష్టారంపాడు, వీరాపురం, రాళ్లపురం, తిమ్మిరిగూడెం, కమలాపురంలో పర్యటించి సూచనలు చేశారు.


