News March 5, 2025

యాదాద్రి: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 40 టీచర్ పోస్టులు, 118 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Similar News

News March 23, 2025

నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

image

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

NLG: వాహనదారులకు శుభవార్త చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

image

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల మీద తిరిగే వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త చెప్పారు. గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారుల రోడ్లకు టోల్ ఫీజు వసూలు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు.

error: Content is protected !!