News February 18, 2025
యాదాద్రి: అమ్మకు భరోసా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో “అమ్మకు భరోసా” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఒకేరోజు 300 మంది గర్భిణుల ఇండ్లకు ఏకకాలంలో 300 మంది అధికారుల బృందాలు వెళ్లాయి. ఇందులో భాగంగా గుండాల మండలంలోని అనంతారానికి చెందిన అపర్ణ అనే గర్భిణి ఇంటికి వెళ్లిన కలెక్టర్ ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, న్యూట్రిషన్ కిట్ అందించారు.
Similar News
News March 24, 2025
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్

బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకున్న తేదీ కన్నా ముందుగానే రానున్నట్లు తాజాగా తెలిపారు. ఏప్రిల్ 4న ఈ చిత్రం రీరిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. భారత దేశ సినీ చరిత్రలోనే తొలి టైమ్ ట్రావెల్ సినిమాగా ఇది రికార్డులకెక్కింది.
News March 24, 2025
ప్రతిజ్ఞ చేయించిన బాపట్ల కలెక్టర్

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లా అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా జిల్లాలో 27 టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా గుర్తించి వాటికి సిల్వర్, బ్రాంజ్ గాంధీ విగ్రహాలను DPOకి అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, DLATO తదితరులు హాజరయ్యారు.
News March 24, 2025
Stock Markets: సెన్సెక్స్ 1000+, నిఫ్టీ 300+

స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,658 (+307), సెన్సెక్స్ 77,984 (+1078) వద్ద ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్లు ₹5లక్షల కోట్లమేర సంపద పోగేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, PSE, రియాల్టి, చమురు, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్ షేర్లు దుమ్మురేపాయి. కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. టైటాన్, ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, ఎయిర్‌టెల్ టాప్ లూజర్స్.