News January 30, 2025
యాదాద్రి: అయోమయంలో రేషన్ కార్డు దరఖాస్తుదారులు

యాదాద్రి జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రజాపాలన సభల్లో కేవలం రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల పేర్లు మాత్రమే చదివి వినిపించారు. అందులో అర్హులైన వారు ఎవరు అనేది వెల్లడించకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ఈ నెల 26 న జిల్లా వ్యాప్తంగా కేవలం 17 గ్రామాల్లో 910 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయడంతో మిగతా వారు తమకు కార్డులు ఎప్పుడోస్తాయో అని ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 13, 2025
మస్కట్లో సిక్కోలు యువతి అనుమానాస్పద మృతి

ఆమదాలవలస మండలం వెదుర్లువలసకి చెందిన నాగమణి (28) జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె వారం రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి అక్కడ తనను వేధిస్తున్నారని చెప్పిందని, ఇంతలోనే ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పినట్లు ఆమె తల్లి తెలిపారు.MLA రవికుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
వేములవాడ: మూడుకు తగ్గిన VIP గెస్ట్ హౌస్లు..!

వేములవాడ రాజన్న ఆలయంలో VIP గెస్ట్ హౌస్ల సంఖ్య మూడుకు తగ్గిపోయింది. భీమేశ్వరాలయం పక్కన మొత్తం 5 గెస్ట్ హౌస్లు ఉండగా, ఇటీవలి మార్పులలో భాగంగా ఒకదాంట్లో PRO కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మరోదాంట్లో లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా రాజన్న భక్తుల కోసం మిగిలిన అతిథి గృహాల సంఖ్య మూడుకు తగ్గింది. ఆలయాభివృద్ధి పనుల నేపథ్యంలో కూల్చివేతల జరుగుతున్నందున ఈ మార్పులు జరుగుతున్నాయి.


