News January 30, 2025
యాదాద్రి: అయోమయంలో రేషన్ కార్డు దరఖాస్తుదారులు

యాదాద్రి జిల్లావ్యాప్తంగా ఇటీవల జరిగిన ప్రజాపాలన సభల్లో కేవలం రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల పేర్లు మాత్రమే చదివి వినిపించారు. అందులో అర్హులైన వారు ఎవరు అనేది వెల్లడించకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. ఈ నెల 26 న జిల్లా వ్యాప్తంగా కేవలం 17 గ్రామాల్లో 910 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయడంతో మిగతా వారు తమకు కార్డులు ఎప్పుడోస్తాయో అని ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 14, 2025
వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
News February 14, 2025
సంగారెడ్డి: విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష

విద్యాశాఖ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా అధికారులతో ఎంఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలకు విడుదలైన నిధులపై సమీక్షించి అందరూ ప్రధానోపాధ్యాయులు ఆ నిధులను వంద శాతం ఖర్చు చేయాలని, మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని సూచించారు.
News February 14, 2025
పెద్దగట్టు జాతరకు 60 స్పెషల్ బస్సులు..

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా RM కే.జానిరెడ్డి తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.