News August 5, 2024
యాదాద్రి ఆలయ ఎలక్ట్రిసిటీ ఈఈపై సస్పెన్షన్ వేటు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఎలక్ట్రిసిటీ ఈఈ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. దేవస్థానం విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న 12 మంది ఒప్పంద ఉద్యోగులు వ్యక్తిగత కారణాలతో జాబ్ మానేశారని.. వారి స్థానాల్లో కొత్తవారిని తప్పు దోవలో ఉద్యోగాల్లో చేర్పించారని విచారణలో తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపారు. ఇన్ఛార్జ్ ఈఈగా దయాకర్ రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 3, 2025
పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News November 3, 2025
చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
News November 3, 2025
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.


