News February 15, 2025

యాదాద్రి: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 9, 2025

బాపట్ల: హైవేపై డివైడర్‌ను ఢీకొట్టిన కారు

image

కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. అరుణాచలం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో స్థానిక నయారా పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ముగ్గురు మహిళలు ఉండగా ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెని 108 అంబులెన్స్‌లో స్థానిక PHCకి తరలించారు.

News December 9, 2025

పాలమూరు: ఎన్నికల మేనిఫెస్టో.. ఆడపిల్ల పుడితే రూ.5,116

image

నర్వ మండలం రాయికోడ్ స్వాతంత్ర అభ్యర్థి సూరం చంద్రకళ, కృష్ణయ్య GP మేనిఫెస్టోను విడుదల చేశారు.
➤ ప్రతి ఆడపిల్ల పెళ్లికి ‘గ్రామ కళ్యాణం’ కింద రూ.2,116
➤అమ్మ వందనం’ పేరుతో ఆడపిల్ల పుడితే రూ. 5,116, మగబిడ్డ పుడితే రూ.2,116
➤ ఆకస్మిక ప్రమాదం జరిగితే తక్షణ సాయం కింద రూ.20,116 అందజేత
➤పదిలో ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థికి రూ.10,116 నగదు బహుమతి
➤భౌతిక కాయం భద్రత కోసం ఫ్రీజర్ ఏర్పాటు.

News December 9, 2025

ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

image

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.