News February 15, 2025

యాదాద్రి: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్గొండ – ఖమ్మం – వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News April 10, 2026

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికను ఉపయోగించండి: ఎస్పీ

image

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

News April 10, 2026

ఇరాన్ పాకిస్థాన్‌కు వెళ్లడం డౌటే?

image

USతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాక్ వేదికగా జరగాల్సిన ఈ చర్చలకు వెళ్లాలని ఓ వర్గం వాదిస్తుంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చల్లేవని మరో వర్గం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత కలహాల మధ్య ఇరాన్ ప్రతినిధుల బృందం ఇంకా ఇస్లామాబాద్ చేరుకోలేదని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇప్పటికే పాక్ పయనమయ్యారు.

News April 10, 2026

HYD: ట్రాఫిక్ చలాన్లకు ఫుల్ స్టాప్.. ఇక ‘కాంటాక్ట్‌లెస్’ పెనాల్టీలు!

image

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు Adaptive Traffic Control Systemలోని లోపాలను సవరిస్తూ కొత్త ఇన్వెస్టిగేటివ్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారులను ఆపి ఇబ్బంది పెట్టకుండా AI కెమెరాల ద్వారానే 99% ఉల్లంఘనలను గుర్తించేలా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మార్చారు. తప్పుడు చలాన్ల వల్ల వచ్చే న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి ఈ సిస్టమ్‌ను తెస్తున్నారు. ‘సేఫ్టీ ఫస్ట్’ నినాదంతో ఈ ప్లాన్ అమలు కాబోతోంది.