News September 24, 2024

యాదాద్రి కలెక్టర్‌తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష సమావేశం

image

పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. నేడు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హనుమంత్, జిల్లా అదనపు కలెక్టర్లు గంగాధర్, బెన్ షాలోమ్, ఆర్డీవో అమరేందర్, ఎలక్షన్ సెల్ డిప్యూటీ తహశీల్దార్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 10, 2025

NLG జిల్లాలో మొదటి విడత ఎన్నికల వివరాలు

image

NLG జిల్లాలో చండూరు, నల్లగొండ డివిజన్లలో మొత్తం 14 మండలాల్లో మొదటి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
✈ సర్పంచ్ స్థానాలు: 294
✈ అభ్యర్థులు: 966 మంది
✈ వార్డు స్థానాలు: 2870
✈ అభ్యర్థులు: 5934 మంది
✈ పోలింగ్ కేంద్రాలు: 2870
✈ ఓట్ల లెక్కింపు: 2 గం. నుంచి
✈ పీవోలు (పోలింగ్ అధికారులు): 3444 మంది
✈ ఉప పీవోలు: 4448 మంది

News December 10, 2025

NLG: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా తుంగతుర్తిలో గుడితండకు చెందిన జైపాల్ నాయక్, రుస్తాపురానికి చెందిన శ్రీహరికుమార్ బాండు పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు.

News December 10, 2025

NLG: 829 జీపీల్లో రేపే పోలింగ్

image

జిల్లాలో మూడు విడతల్లో 869 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి మంగళవారం ప్రచార ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.