News September 30, 2024

యాదాద్రి కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 12 తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

Similar News

News February 27, 2026

మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితోతో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.

News February 26, 2026

నల్గొండ: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్.. దరఖాస్తుల ఆహ్వానం

image

టీజీఎస్ఆర్టీసీ నల్గొండ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ కె. జానిరెడ్డి తెలిపారు. 2022 నుంచి 2025 మధ్య ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు nats.education.gov.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 26, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

image

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.