News February 11, 2025
యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్!

యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ గురైనట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ ఉద్యోగి విధులకు హాజరుకాకపోగా, రికార్డు అసిస్టెంట్ కొండపైకి వెళ్లే వాహనాల రుసుములను ఆలయానికి చెల్లించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
News October 28, 2025
HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్‌తో ఛాటింగ్‌కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.
News October 28, 2025
కరీంనగర్: ఉరివేసుకొని రాజస్థాన్ కూలి మృతి

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ కూలి ఉరివేసుకుని మృతి చెందాడు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన బూర రామ్ గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాయికి ఉంటున్న ఇంట్లోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


