News September 6, 2024

యాదాద్రి క్షేత్రంలో ఇవాళ చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గంలకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News October 25, 2025

బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

image

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

News October 25, 2025

అవంతిపురంలో రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

image

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో జరుగుతున్న ధాన్యం ప్రాసెసింగ్ విధానాన్ని, బాయిల్డ్ రైసు తయారీని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని మిల్లు యజమానికి కలెక్టర్ సూచించారు.

News October 25, 2025

NLG: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..!

image

జిల్లాలో ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదు (4906)లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా 2 వేల దరఖాస్తులు తక్కువ రావడం అధికారులను నివ్వెరపోయేలా చేసింది. అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది.