News April 4, 2025
యాదాద్రి క్షేత్రంలో చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంలకు మహాచండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 6, 2025
ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
News November 6, 2025
సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
News November 6, 2025
అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.


