News December 6, 2024
యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ ఉ. 9గం.లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డూ, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 28, 2024
నల్గొండ పొలిటికల్ రౌండప్ @2024
కాంగ్రెస్‌కి నల్గొండ 2024లో కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 గెలవడంతో పాటు రెండు ఉత్తమ్, కోమటిరెడ్డికి మంత్రి పదవులు దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందన్నారు. మరో వైపు BRS SRPT స్థానాన్ని గెలుచుకుని ప్రస్తుతం పట్టుకోసం ప్రయత్నిస్తోందంటున్నారు. రాజకీయంగా ఎదగడానికి బీజేపీ, కమ్యూనిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. COMMENT
News December 28, 2024
యాక్సిడెంట్‌కు ముందు ఫొటో.. కంటతడి పెట్టిస్తోంది
భువనగిరి సమీపంలో శుక్రవారం రాత్రి <<14998405>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శామీర్‌పేటకు చెందిన దంపతులు జగన్, పావని వారి పిల్లలు సాత్విక, కన్నయ్య యాదాద్రి దర్శనం చేసుకున్నారు. తిరుగుప్రయాణంలో జరిగిన ప్రమాదంలో పావని, కుమారుడు కన్నయ్య మృతి చెందారు. తండ్రీకుమార్తెకు గాయాలయ్యాయి. దర్శనం అనంతరం రాయగిరి మినీ ట్యాంక్ బండ్ వద్ద ఫ్యామిలీతో దిగిన ఫొటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
News December 28, 2024
భువనగిరి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే భువనగిరికి చెందిన రేవంత్ అమీర్ పేట్ లో టెక్నికల్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఔషాపూర్ సమీపంలో శిరిడి ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.