News February 18, 2025

యాదాద్రి: గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5:30 గంటలకు ప్రదక్షిణ స్వామివారి కొండ కింద ప్రధాన(పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

మంచిర్యాల జిల్లాలో సర్పంచి స్థానాలకు 99 నామినేషన్లు

image

మంచిర్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. శుక్రవారం 90 సర్పంచ్ స్థానాలకు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 816 వార్డులకు 222 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3న ఉపసంహరణ, 11న పోలింగ్ జరగనుంది.

News November 28, 2025

MDK: రెండో రోజు 152 సర్పంచ్, 186 వార్డు నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్ స్థానాలకు 152, వార్డు సభ్యుల స్థానాలకు 186 నామినేషన్లు వచ్చాయి. అల్లదుర్గ్ 14, హవేలీఘనపూర్ 49, పాపన్నపేట్ 25, రేగోడు 18, శంకరంపేట్(ఏ) 17, టేక్మాల్ 29 సర్పంచ్ నామినేషన్లు స్వీకరించారు. వివరాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు.

News November 28, 2025

వనపర్తిలో 780 వార్డులకు 276 నామినేషన్లు

image

వనపర్తి జిల్లాలో మొదటి విడత జరగనున్న 87 గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని మొత్తం 780 వార్డులకు రెండు రోజుల్లో 276 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 250 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా వివరాలు:
ఘనపూర్: 90
పెద్దమందడి: 83
రేవల్లి: 51
గోపాల్‌పేట: 19
ఏదుల: 07