News March 17, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం గిరిప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2025
మైనార్టీలపై వేధింపుల ఆరోపణలు.. ఖండించిన యూనస్ ప్రభుత్వం

బంగ్లాదేశ్లో మైనార్టీలపై వేధింపులకు పాల్పడుతున్నారన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలను యూనస్ ప్రభుత్వం ఖండించింది. ఆమె వ్యాఖ్యలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. తమ దేశానికి అపవాదు తెచ్చేలా ఆమె మాట్లాడారని మండిపడింది. భారత్ పర్యటనలో ఉన్న తులసి బంగ్లాదేశ్లో మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆమె కలిశారు.
News March 18, 2025
సంగారెడ్డి: ఇంటి వద్దకే భద్రాచలం తలంబ్రాలు

భద్రాచలం సీతారాముల తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రీజనల్ మేనేజర్ ప్రభులత మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు లాజిస్టిక్ కేంద్రాలు రూ.150 చెల్లించి బుక్ చేసుకోవాలని చెప్పారు. సీతారాముల కళ్యాణం తర్వాత ఇంటికి వచ్చి తలంబ్రాలను తమ సిబ్బంది అందిస్తారని పేర్కొన్నారు.
News March 18, 2025
ఆ విషయంలో కేంద్రం నుంచి నిధులు రాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

TG: గోదావరి నుంచి నీటి తరలింపునకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరామని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తెలిపారు. గుజరాత్, యూపీ రివర్ ఫ్రంట్లకు నిధులిచ్చి నదుల ప్రక్షాళన చేశారన్నారు. గోదావరి నుంచి 2.5 టీఎంసీల నీటిని మూసీకి తరలించే ప్రాజెక్టుకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదని చెప్పారు.