News April 13, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సోమవారం గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
అడిషనల్ జడ్జ్‌గా క్షమా దేశ్‌పాండే బాధ్యతలు

వరంగల్ జిల్లాకు SPE, ఏసీబీ(ACB) కేసుల స్పెషల్ కోర్టులో అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జ్‌గా బాధ్యతలు చేపట్టిన క్షమా దేశ్‌పాండేను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.మురళీధర్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు ఆకారం శ్రీనివాస్ కుమార్, కోశాధికారి రాజేశ్ కుమార్ తదితరులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
News November 14, 2025
యూఏఈపై భారత్-ఎ విజయం

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ <<18287840>>టోర్నీలో<<>> భారత్-ఎ బోణీ కొట్టింది. UAEతో జరిగిన తొలి టీ20లో 148 రన్స్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొండంత లక్ష్యం(298)తో బరిలోకి దిగిన యూఏఈ 149 రన్స్‌కే పరిమితమైంది. ఆ జట్టులో సోహైబ్ ఖాన్(63) ఒక్కడే పోరాడారు. ఇండియన్ బౌలర్లలో గుర్జప్నీత్ 3, హర్ష్ దూబే 2 వికెట్లు తీశారు. భారత్ తన తర్వాతి మ్యాచులో పాకిస్థాన్-ఎతో ఈనెల 16న తలపడనుంది.
News November 14, 2025
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్ ధోత్రే

ఆసిఫాబాద్ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఆయన హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.


