News February 18, 2025
యాదాద్రి: గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5:30 గంటలకు ప్రదక్షిణ స్వామివారి కొండ కింద ప్రధాన(పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2026
జగిత్యాల రాజకీయాల్లో పోస్టర్‌పై హాట్ చర్చ

జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య జీవన్ రెడ్డి చేరిక అంశం SMలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో విభిన్న పోస్టర్లు, కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. తాజాగా ఎంపీ అర్వింద్ అధికారిక అకౌంట్‌లో షేర్ చేసిన పొలిటికల్ పోస్టర్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. BRS ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలను, జీవన్ రెడ్డి చేరిక అంశాన్ని లింక్ చేస్తూ విమర్శలు చేసిన ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
News April 17, 2026
ఎల్లారెడ్డి: కూలర్ మరమ్మతులు.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) తన ఇంట్లో కూలర్ మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలు కావటంతో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
News April 17, 2026
ప్రొద్దుటూరు: కుటుంబంలో నలుగురూ మృతి.!

ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్లో గత నెల 26న అత్త మందలించిందని భువనేశ్వరి కూల్ డ్రింక్‌లో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తాగించి తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ 28న భువనేశ్వరి మృతి చెందింది. పిల్లలను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ నెల 10న లిఖిత(11), 15న గణ(9), (నిన్న) 16న సుష్మ (13) మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలముకుంది.


