News September 22, 2024
యాదాద్రి: గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి

గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని (తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News October 21, 2025
NLG: కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలోని PMSHRI పథకం కింద (36 ) ప్రభుత్వ స్కూల్స్ నందు బాలికలకు స్వీయ రక్షణకు సంబందించి 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు కావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. ఇందుకు గాను బ్లాక్ బెల్ట్ కలిగిన వారు అర్హులు వారికి నెలకు రూ. 10 వేలు చొప్పున పారితోషకం ఇస్తామన్నారు. మొదటిగా మహిళా అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
News October 21, 2025
మెగా జాబ్ మేళాలో పాల్గొనాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఈనెల 25న HZNRలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు NLG జిల్లా నుంచి నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాబ్ మేళా పై MGU, ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
News October 21, 2025
తాత్కాలిక కార్మికులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

నల్గొండ జిల్లాలోని తాత్కాలిక (గిగ్) కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అమెజాన్, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే రోజువారీ కూలీలు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. ఈ నెలాఖరులోగా కనీసం 4 వేల మందికి బీమా చేయించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.