News November 1, 2024
యాదాద్రి: చేపల వేటకెళ్లి గల్లంతు.. మృతదేహం లభ్యం

వలిగొండ మూసీలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. కిరణ్ అనే బాలుడి మృతదేహం నిన్న లభ్యం కాగా.. జీవన్ అనే బాలుడి మృతదేహం ఇవాళ దొరికింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు మృతిచెందడంతో వారి ఇరువురి కుటుంబాలు తీవ్ర శోకతప్త హృదయంతో మునిగిపోయాయి.
Similar News
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.
News November 16, 2025
నల్గొండ జిల్లాలో చలి పులి పంజా

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 – 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు జిల్లాలో శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి, పగలు శీతల గాలులు వీస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.
News November 16, 2025
NLG: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించిన కలెక్టర్

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న అన్ని పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లేపల్లి మండలం, పెండ్లిపాకల రిజర్వాయర్‌ను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.


