News November 1, 2024
యాదాద్రి: చేపల వేటకెళ్లి గల్లంతు.. మృతదేహం లభ్యం
వలిగొండ మూసీలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతైన విషయం తెలిసిందే. కిరణ్ అనే బాలుడి మృతదేహం నిన్న లభ్యం కాగా.. జీవన్ అనే బాలుడి మృతదేహం ఇవాళ దొరికింది. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు మృతిచెందడంతో వారి ఇరువురి కుటుంబాలు తీవ్ర శోకతప్త హృదయంతో మునిగిపోయాయి.
Similar News
News December 8, 2024
4 లైన్ల రోడ్లకు రూ.236 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి నార్కెట్ పల్లి- అద్దంకి -మెదర్ మెట్ల వరకు 236 కోట్ల రూపాయల వ్యయంతో 4లైన్ల నూతన సిసి రోడ్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ ద్వారా జి ఓఆర్ టి నంబర్ 926 జారీ చేసింది. వైటిపిఎస్ నుండి నామ్ రోడ్ వరకు 4 లైన్ల సిసి రోడ్ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి NLG REPORT
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన రేవంత్.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇవాళ నల్గొండకు రానున్న రేవంత్ బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ప్రారంభం, నల్గొండలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. ఏడాది పాలనపై మీ కామెంట్.
News December 7, 2024
నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణవెల్లంలకు చేరుకుంటారు. 2.40 గంటలకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నారు. 3.20గంటలకు యాదాద్రి ధర్మల్ పవర్ యూనిట్ -2 శక్తివంత స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నల్గొండ మెడికల్ కాలేజ్‌ని ప్రారంభిస్తారు. 5-6 గంటలకు పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు.