News March 19, 2025

యాదాద్రి టెంపుల్ బోర్డు స్వరూపమిదే..

image

TTD తరహాలో యాదాద్రిలో పాలక మండలి బోర్డు (YTD) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. YTDకి రెండేళ్ల పదవీ కాలం ఉండనుంది. బోర్డులో 18 మంది సభ్యులుంటారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు జీతాలు ఉండవు. టీటీడీ బోర్డు మాదిరిగానే వైటీడీ బోర్డుకు ఐఏఎస్ అధికారి ఈఓగా ఉంటారు. ఫౌండర్ ట్రస్టీ, MLA లేదా MLC, SC, ST, BC సభ్యులతో పాటు మరో నలుగురు సభ్యులుంటారు. మిగిలిన వారిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

Similar News

News February 23, 2026

బాఫ్టాలో భారతీయ సినిమా ‘బూంగ్’ చరిత్ర.. బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా అవార్డు!

image

BAFTA-2026 అవార్డుల్లో మణిపురీ చిత్రం ‘Boong’ సత్తా చాటింది. ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం’ కేటగిరీలో అవార్డు గెలుచుకొంది. ఈ విభాగంలో బాఫ్టా అవార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘జూటోపియా 2’ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు.

News February 23, 2026

జీవన విధానం ఎలా ఉండాలో చెప్పే శ్లోకం

image

ఆపదర్థం ధనం రక్షేత్ దారాన్ రక్షే ద్ధనై రపి|
ఆత్మానం సతతం రక్షేత్ దారై రపి ధనై రపి||
భవిష్యత్తులో వచ్చే కష్టాల కోసం ధనాన్ని దాచుకోవాలి. అవసరమైతే ఆ ధనాన్ని ఖర్చు చేసైనా కుటుంబాన్ని రక్షించుకోవాలి. కానీ, ప్రాణ సంకట సమయంలో ధనం, కుటుంబం కంటే తన్ను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. తాను జీవించి ఉంటేనే కదా మళ్లీ సంపదను, సంసారాన్ని చూసుకోగలడు!

News February 23, 2026

ఎర్రవల్లి: బస్సు కింద పడి గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

image

ఎర్రవల్లి మండలం బొచ్చు వెంగనపల్లెకు చెందిన అంజలి అనే చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందింది. హైదరాబాద్‌లో చదువుతున్న అంజలి, తల్లితో కలిసి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.