News April 4, 2025
యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
Similar News
News November 28, 2025
సూర్యాపేట: ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

మోతె మండలం రవికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి భూక్యా ఉప్పయ్యను సర్పంచ్‌గా ఎన్నుకున్నాయి. మోతె మండలంలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షల నిధులు ప్రకటించారు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in
News November 28, 2025
కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.


