News April 4, 2025

యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.

Similar News

News April 20, 2025

KU డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News April 20, 2025

ఒకే కాన్పులో ముగ్గురు జననం

image

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్ థైరాయిడ్ ఉండటం వలన ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనించారు.  

News April 20, 2025

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!