News March 30, 2025

యాదాద్రి దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

image

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పంచాంగాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. 

Similar News

News November 20, 2025

చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

image

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.

News November 20, 2025

GWL: ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి- కురువ పల్లయ్య

image

స్టూడెంట్‌ను మోకాళ్లపై నడిపించి గాయాలు అయ్యేందుకు కారణమైన వడ్డేపల్లి మండలంలోని శారద విద్యానికేతన్ గుర్తింపును రద్దు చేయాలని BRSV గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. గురువారం గద్వాలలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో వేలకు వేలు ఫీజు చెల్లించి, విద్యాబుద్ధులు నేర్పమని పంపితే అనాగరికంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడమేంటంటూ ప్రశ్నించారు.

News November 20, 2025

వరంగల్: పోలీస్ సిబ్బందికి రేపు ఉచిత వైద్య శిబిరం

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రేపు (శుక్రవారం) ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రముఖ వైద్య నిపుణుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ (సీపీ) సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.