News March 15, 2025
యాదాద్రి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News March 8, 2026
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పల్లేటి లక్ష్మణ్

ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా పల్లేటి లక్ష్మణ్ మాదిగ నియమితులయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకులు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాదిగల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
News March 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధమ కర్తవ్యం: ఎమ్మెల్యే శిరీష
లావేరు: ఇసుక రవాణాలో కానరాని నిబంధనలు
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల పోలీసులు కార్డెన్ సెర్చ్
శ్రీకాకుళం: ఏయూ స్టడీ సెంటర్ కొనసాగిస్తారా ?
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టండి: ఇచ్ఛాపురం వైసీపీ సమన్వయకర్త
జిల్లాలో పలు చోట్ల పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత
News March 7, 2026
మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ నరసింహ

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. మహిళా భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, వేధింపుల నివారణకు షీ టీమ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని, ధైర్యంగా లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలుంటే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.


